ETV Bharat / snippets

రామోజీరావు మృతికి నివాళి- రాష్ట్రంలో రెండ్రోజులపాటు సంతాప దినాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 7:57 PM IST

Two_Days_of_Mourning_in_AP_as_a_Tribute_to_Ramojirao
Two_Days_of_Mourning_in_AP_as_a_Tribute_to_Ramojirao (ETV Bharat)

Two Days of Mourning in AP as a Tribute to Ramojirao: అక్షరయోధుడు రామోజీరావుకు నివాళిగా రేపు, ఎల్లుండి సంతాప దినాలుగా ప్రకటించారు. ఆదివారం, సోమవారం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిల్మ్ సిటీలో రేపు ఉదయం 9 నుంచి 10 మధ్య రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివారం నిర్వహించనున్న అంత్యక్రియల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముగ్గురు సీనియర్ అధికారులు ఆర్పీ సిసోడియా, సాయిప్రసాద్, రజత్ భార్గవ హాజరుకానున్నారు. ఈ ముగ్గురు ప్రభుత్వ అధికార ప్రతినిధులు రామోజీరావు పార్థివదేహంపై పుష్ప గుచ్ఛం సమర్పించి నివాళి అర్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు రోజులు జాతీయపతాకం సగం వరకు అవనతం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారికంగా ఏ వేడుకలు నిర్వహించరాదని పేర్కొంటూ ఉత్తర్వుల్లో పొందుపర్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.