రాష్ట్రంలో చికెన్ ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. శ్రావణమాసం ఎఫెక్ట్ కారణంగా కొండ మీద కూర్చున్న రేట్లు కిందకు దిగి వస్తున్నాయి. గత నెలలో కేజీ చికెన్ ధర రూ.300 మార్క్ దాటిపోయింది. కానీ.. శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో.. చాలా ఇళ్లలో నీచు ముట్టుకోవట్లేదు. దీంతో బేరాల్లేక చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. ఫలితంగా రేట్లు భారీగా తగ్గిస్తున్నారు. ఇవాళ కేజీ కోడి (ఫామ్ రేటు) 87 రూపాయలు మాత్రమే. రిటైల్ లో ఈ ధర 109 రూపాయలుగా ఉంది. డ్రెస్సింగ్ చేసిన కోడి కేజీ రూ.158, స్కిన్లెస్ కేజీ 180 రూపాయలుగా ఉంది.
ఇవాళ కేజీ చికెన్ ధర ఎంతో తెలుసా? - భారీగా పడిపోయిన రేట్లు!
Published : Aug 16, 2024, 10:44 AM IST