KualaLumpur Flight Missed Huge Accident : హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ముప్పు తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకే విమానం కుడివైపు ఇంజిన్‌లో మంటలు వచ్చాయి. వెంటనే గుర్తించిన పైలట్ ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. దీంతో ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ అధికారులు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.
ఇక్కడి నుంచి నేరుగా కౌలాలంపూర్ వెళ్లాల్సిన ఫ్లైట్ కావడంతో అధికారులు పెద్ద మొత్తంలో ఇంధనం నింపారు. దీంతో ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగుతాయని భావించి దాదాపు 3 గంటల పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. సరిగ్గా 12:45కు టేకాఫ్ అయిన ఫ్లైట్‌ను 3:58 గంటలకు పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశాడు. విమానంలో సిబ్బందితో పాటు 138 మంది ప్రయాణికులు ఉన్నారు. సేఫ్‌గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.