ETV Bharat / snippets

గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికులకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

ExGratia Guidelines for Gulf Countries Workers
TG Govt on Ex Gratia Guidelines for Gulf Countries Workers (ETV Bharat)

TG Govt on ExGratia Guidelines for Gulf Countries Workers : గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికులకు ఎక్స్​గ్రేషియా చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు గల్ఫ్ మృతుల కుటంబ సభ్యులకు రూ.5 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో 2023 డిసెంబరు 7 తర్వాత మరణించిన కార్మికులకు ఎక్స్​గ్రేషియా వర్తిస్తుందని మార్గదర్శకాల్లో సీఎస్ శాంతికుమారి వెల్లడించారు.

కార్మికులు మృతి చెందిన ఆరు నెలల్లో భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్​కు దరఖాస్తు సమర్పించాలని సీఎస్ శాంతికుమారి తెలిపారు. మరణ ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. ఆర్థిక సాయం రూ.5 లక్షలు నేరుగా బ్యాంకులో జమ చేయనున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.