ETV Bharat / snippets

జనవరి 6న ఓటర్ల తుది జాబితా ప్రచురణ : సీఈవో సి. సిదర్శన్ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 9:43 AM IST

CEO Sudarsan Reddy On Voter Enrollment
CEO Sudarsan Reddy On Voter Enrollment (ETV Bharat)

CEO Sudarsan Reddy On Voter Enrollment : జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారందరూ ఓటు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.సుదర్శన్ రెడ్డి కోరారు. గత నెల 20 న ప్రారంభమైన ఎన్నికల జాబితా ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అక్టోబరు 29న ముసాయిదా జాబితా ప్రకటించి నవంబరు 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. జనవరి 6న తుది జాబితా ప్రచురించనున్నట్లు సీఈవో తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 33 లక్షల 27 వేల304 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 8 లక్షల దరఖాస్తులు రాగా వాటిలో 2 లక్షల 45వేలు పెండింగులో ఉన్నాయని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలకు శిక్షణ పూర్తయిందన్నారు. ఓటరు కార్డు, ఆధార్ లింకు సుమారు 60శాతం పూర్తయిందని సీఈవో చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.