ETV Bharat / snippets

కువైట్​లో అగ్నిప్రమాదం - ముగ్గురు ఏపీ వాసులు మృతి

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 10:10 AM IST

Indians Killed in Kuwait Fire Accident
Several Telugu People Killed In Kuwait Fire Accident (ETV Bharat)

AP People Killed In Kuwait Fire Accident : కువైట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారిలో 45మంది భారతీయు ఉన్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. వారిలో ముగ్గురు తెలుగు వారు కాగా 24 మంది కేరళవాసులు, ఏడుగురు తమిళనాడుకు చెందినవారు ఉన్నారు. మిగిలిన వారు ఉత్తరాదికి చెందిన వారిగా తెలుస్తోంది. వారి మృతదేహాలను భారత్​కు తరలించేందుకు వాయుసేన విమానాన్ని సిద్ధంగా ఉంచింది.

కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురున్నట్లు ఏపీ నాన్‌రెసిడెంట్‌ తెలుగు సొసైటీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం దిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.