ETV Bharat / snippets

ధరణి కొత్త బిల్లుపై ప్రజాభిప్రాయం - సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఇదే వెబ్​సైట్​

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 7:18 PM IST

Public Referendum on Dharani New ROR Bill
Public Referendum on Dharani New ROR Bill (ETV Bharat)

Public Referendum on Dharani New ROR Bill : రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ సమస్యల పరిష్కారానికి నూతన ఆర్ఓఆర్ బిల్లు - 2024పై సర్కారు ప్రజాభిప్రాయ సేకరణ చేయనుంది. ఈ ముసాయిదా బిల్లును ప్రజలు, రైతులు, వివిధ వర్గాల సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్‌సైట్‌: www.ccla.telangana.gov.inలో అందుబాటులో ఉంచుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రకటన జారీ చేశారు. ఆగస్టు 2వ నుంచి 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించింది. ప్రజలు తమ సలహాలు సూచనలు ఈ-మెయిల్: ror2024-rev@telangana.gov.in చేయాలి లేదా పోస్ట్ ద్వారా సీసీఎల్ఏ కార్యాలయానికి పంపించవచ్చు. చిరునామా: ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి, స్టేషన్ రోడ్ హైదరాబాద్ 500001కు పోస్టు చేయవచ్చని భూపరిపాలన ప్రధాన కమిషనర్ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.