ETV Bharat / snippets

సీఎం, మంత్రుల పన్నులు ప్రభుత్వం ఎలా చెల్లిస్తుంది? - హైకోర్టులో విచారణ షురూ

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 7:49 PM IST

Petition on Govt Payment Tax Of CM and Ministers
Petition on Govt Payment Tax Of CM and Ministers (ETV Bharat)

Petition on Govt Payment Tax Of CM and Ministers : సీఎం, మంత్రులకు ఇస్తున్న వేతనాలకు సంబంధించిన పన్నును ప్రభుత్వం చెల్లించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజనం వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ప్రజల లాగే సీఎం, మంత్రులు పన్ను చెల్లించాల్సి ఉందని కానీ ప్రభుత్వం చెల్లించడం తగదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం సేవలకు వేతనాలు పొందేవాళ్లు ఆదాయపన్ను చెల్లించాల్సిందేనని ప్రభుత్వం చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. పిటిషన్‌లో పేర్కొన్న చట్టంపై హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. దీంతో పిటీషన్‌లోని అంశాలను సవరించడానికి సమయం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. తెలంగాణ హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.