ETV Bharat / snippets

ఆరు లేన్ల ఫ్లై ఓవర్​ను రెండేళ్లలో పూర్తి చేస్తాం: ఎంపీ కేశినేని చిన్ని

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 7:40 PM IST

MP Kesineni Chinni
MP Kesineni Chinni (ETV Bharat)

MP Kesineni Chinni On Vijayawada Development: విజయవాడ వాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పష్టంచేశారు. విజయవాడ మహానాడు రోడ్ నుంచి నిడమానూరు వరకు ఆరు లైన్​ల ఫ్లై ఓవర్​కు కేంద్రం అనుమతి లభించిందని ఎంపీ వివరించారు. 800 కోట్లతో రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఇది రెండేళ్ల కాలపరిమితిలో పూర్తి చేస్తామన్నారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కాబోతున్నాయని ఎంపీ వివరించారు. 2500 కోట్లతో తూర్పు బైపాస్​కు కూడా త్వరలో పరిపాలనా అనుమతులు రాబోతున్నాయని వెల్లడించారు. రేడియల్ రోడ్​లను కూడా ప్రారంభిస్తామన్నారు. మూడేళ్ల కాలపరిమితిలో తూర్పు బైపాస్ పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. అమృత్ పథకం కింద విజయవాడ రైల్వేస్టేషన్ పరిగణించటంతో నిధులు త్వరలోనే విడుదల అవుతాయని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.