ETV Bharat / snippets

హైదరాబాద్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ కంపెనీ విస్తరణ - సీఎం రేవంత్​ సమక్షంలో కుదిరిన ఒప్పందం

CM Revanth America Tour
Monarch Tractors to Expand Company in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 7:08 AM IST

Monarch Tractors to Expand Company in Hyderabad : హైద‌రాబాద్‌లో తమ సంస్థ విస్త‌ర‌ణ‌కు మోనార్క్ ట్రాక్ట‌ర్స్ సంస్థ ముందుకు వ‌చ్చింది. తెలంగాణ‌కు పెట్టుబ‌డుల సాధ‌నే ల‌క్ష్యంగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న ముఖ్య‌మంత్రి రేవంత్​ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందాన్ని మోనార్క్ ట్రాక్ట‌ర్స్ సంస్థ ప్ర‌తినిధులు క‌లిశారు. అనంత‌రం సంస్థ ప్ర‌తినిధులు హైదరాబాద్‌లో త‌మ ఆర్అండ్​డీ సంస్థ‌కు అనుబంధంగా స్వయంప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టిసారించామ‌ని, మోనార్క్ ట్రాక్టర్స్‌ను తెలంగాణ‌కు ఆహ్వానిస్తున్నామ‌ని సీఎం రేవంత్ తెలిపారు. స్వయంప్రతిపత్తి ,ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామ‌ని, ఆ విజ‌న్‌లో మోనార్క్ ట్రాక్ట‌ర్స్ భాగ‌మై రాష్ట్రంలో తమ ఉనికిని విస్త‌రించుకోవాల‌ని తాము ఆశిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి అన్నారు. రాష్ట్రంలో త‌మ కార్య‌క‌లాపాలపై చర్చించేందుకు సీఎం రేవంత్, ఇత‌ర అధికారుల‌ను క‌ల‌వ‌డం ఎంతో సంతోషం క‌లిగించిద‌ని మోనార్క్ ట్రాక్టర్స్ సీఈఓ ప్రవీణ్ పెన్మెత్స వెల్ల‌డించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.