ETV Bharat / snippets

చేప పిల్లల పంపిణీకి బదులుగా నగదు చెల్లించండి - రేవంత్​ రెడ్డికి జీవన్ రెడ్డి విజ్ఞప్తి

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 4:00 PM IST

MLC jeevan Reddy On Free Fish Distribution
MLC jeevan Reddy On Free Fish (ETV Bharat)

MLC jeevan Reddy On Free Fish Distribution : రాష్ట్రంలో మత్య్సకారులకు చేప పిల్లలకు బదులుగా, వాటి విలువకు అనుగుణంగా నగదు రూపంలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మత్య్సకారులకు వారి వృత్తిపరంగా ప్రోత్సాహకానికి మత్య్స పారిశ్రామిక సొసైటీ పరిధిలోని చెరువులు, కుంటల విస్తీర్ణతను పరిగణలోకి తీసుకుని విత్తనానికి సంబంధించిన చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.

అయితే గత నెల జులైలో టెండర్లు పిలవగా సంబంధిత చేప పిల్లల పంపిణీకి సంబంధించిన గుత్తేదారులు అందరూ కుమ్మక్కయ్యారని పంపిణీ నిబంధనలు సడలింపజేసే విధంగా ఎవరూ పాల్గొనకుండా వాయిదా వేశామన్నారు. చేప పిల్లల పంపిణీలో సైజ్, సంఖ్య కీలకమమైనవన్నారు. ఈ నిబంధనలు పాటించడం ఇబ్బందికరంగా ఉందని, అందుకే చేప పిల్లలకు బదులుగా నగదు రూపంలో సహాయం చేయాలని సీఎంను కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.