ETV Bharat / snippets

'ఎస్​ఎల్​బీసీకి ప్రభుత్వ పూర్తి సహకారం - నిర్మాణ పనుల్లో వేగం పెంచండి'

author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

SLBC TUNNEL IN NALGONDA
MINISTERS INSPECTED THE SLBC TUNNEL (ETV Bharat)

SLBC TUNNEL IN NALGONDA : నల్గొండ జిల్లాలో ఎస్​ఎల్​బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్​ కెనాల్​) టన్నెల్‌ పనులను రాష్ట్ర మంత్రులు పరిశీలించారు. కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సొరంగం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టన్నెల్‌ను పరిశీలించారు.

సొరంగం పనుల పురోగతిని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని, నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ టన్నెల్​ పూర్తయితే ఉమ్మడి నల్గొండకు సాగు నీటి సమస్యలు పూర్తిగా తీరనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.