ETV Bharat / snippets

జులై 31 ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాలి - లేకుంటే జీతాలు ఇవ్వలేం : శ్రీధర్ బాబు

Telangana Budget Bill 2024
Minister Sridhar Babu On Telangana Budget (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 23, 2024, 5:20 PM IST

Minister Sridhar Babu On Telangana Budget Bill : ఈ నెల 25న తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. నేడు కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిందని ఆ కేటాయింపులను పరిశీలించి బడ్జెట్ నిర్ణయించుకుంటామని ఆయన తెలిపారు. మాజీమంత్రి హరీశ్​రావుకి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలిసి కూడా తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ఇచ్చిన అంశాలపై స్పీకర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

జులై 31 తేదీలోగా బడ్జెట్​కు సంబంధించి అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాలని లేదంటే జీతాలు కూడా రాని పరిస్థితి అని మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం స్పీకర్​ని కోరిందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఆచరణతో ముందుకు పోతున్నామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.