ETV Bharat / snippets

ఒక్క మెసేజ్​తో గ్రామానికి ఆర్టీసీ బస్సు- లోకేశ్ స్పందనకు విద్యార్థి సంఘాల వందనం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 12:52 PM IST

Lokesh Respond Students Mail
Lokesh Respond Students Mail (ETV Bharat)

Lokesh Respond Students Bus Problem in Marlamadiki : తనకు ఒక్క మెసేజ్‌ పెడితే, వెంటనే స్పందిస్తానని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో బాధితులు ఏ సహాయం కావాలన్నా ఆయనకు సందేశాలు పంపిస్తున్నారు. అందుకు లోకేశ్ స్పందించి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. తాజాగా కర్నూల్ జిల్లా హులగుంద మండలం మార్లమడికి గ్రామానికి ఆర్టీసీ బస్సు నడపాలని లోకేశ్​కు విద్యార్థి సంఘాలు, విద్యార్థులు మెయిల్ చేశారు.

Lokesh Respond Students Mail : వెంటనే స్పందించిన లోకేశ్​, ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఈ క్రమంలోనే మార్లమడికి గ్రామానికి బస్సు సర్వీసును ఆదోని ఆర్టీసీ డిపో అధికారులు ప్రారంభించారు. దీంతో మంత్రి లోకేశ్​కు విద్యార్థి సంఘాలు, గ్రామస్తులు ధన్యవాదములు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.