ETV Bharat / snippets

వర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు - ప్రక్షాళన కోసమే వీసీ నోటిఫికేషన్ : మంత్రి లోకేశ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 2:55 PM IST

Minister Lokesh on Universities VC Notification
Minister Lokesh on Universities VC Notification (ETV Bharat)

Minister Lokesh about Universities VC Notification : రాష్ట్రంలో గత ఐదేళ్లుగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఇందులో భాగంగానే రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. పరిశోధనపై దృష్టి సారించి, ర్యాంకింగ్స్ మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వర్శిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం కలిగిన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28 చివరి తేదీ అని 'ఎక్స్' వేదికగా తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.