Weather in Andhra Pradesh : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అది ఈశాన్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈనెల 25 నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతం కానున్నట్లు తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో నైరుతి రుతుపవనాలు మరింతగా పురోగమించినట్లు వెల్లడించింది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. అరేబియా సముద్ర ప్రాంతాలు, మాల్దీవులు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం విస్తరించినట్లు ఐఎండీ ప్రకటించింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - రేపటికి వాయుగుండంగా మారే అవకాశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 23, 2024, 3:16 PM IST