ETV Bharat / snippets

పుంగనూరులో కలకలం- ఇండోర్ షటిల్ కోర్టు భవనం కూల్చివేత

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 5:04 PM IST

Indoor Shuttle Court Building was Demolished in Punganur
Indoor Shuttle Court Building was Demolished in Punganur (ETV Bharat)

Indoor Shuttle Court Building was Demolished in Punganur : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇండోర్ షటిల్ కోర్టు భవనం ధ్వంసమైన ఘటన కలకలం రేపుతొంది. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. సుమారు 60 లక్షల రూపాయలతో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టు భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు యంత్రాలతో కూల్చేశారని స్థానికులు గుర్తించారు. 2013 లో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ సభ్యులతో పాటు మరికొంత మంది విరాళాలతో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టు భవనం నేల మట్టం కావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.