ETV Bharat / snippets

హైదరాబాద్​ వాసులకు గుడ్​న్యూస్ - మెట్రో పెయిడ్ పార్కింగ్​పై వెనక్కి తగ్గిన ఎల్​అండ్​టీ

Hyderabad Metro Paid Parking Postponed
Hyderabad Metro Paid Parking Postponed (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 9:18 AM IST

Hyderabad Metro Paid Parking Postponed : హైదరాబాద్​లోని నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ ఫీజు వసూళ్లపై ఎల్అండ్​టీ మెట్రో రైలు సంస్థ వెనక్కి తగ్గింది. పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి నేటి నుంచి నాగోల్ మెట్రోస్టేషన్, సెప్టెంబర్ 1 నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. కానీ ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, నిరసనల దృష్ట్యా తాత్కాలికంగా పెయిడ్ పార్కింగ్ అంశాన్ని వాయిదా వేశామని సంస్థ తెలిపింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తదుపరి నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎల్​అండ్​టీ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.