ETV Bharat / snippets

హైదరాబాద్​ శివారులో రూ.34లక్షల గంజాయి పట్టివేత

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 5:21 PM IST

GANJA VALUE RUPEES IN 34 LAKHS
Huge Amount of Ganja Seized in Hyderabad (ETV Bharat)

Huge Amount of Ganja Seized in Hyderabad: హైదరాబాద్ నగర శివారు పెద్ద అంబర్‌పేటలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడిందని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషీ వెల్లడించారు. తమకు అందిన సమాచారంతో రూ.34 లక్షలు విలువ చేసే 170 కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. ఈ స్మగ్లింగ్​తో సంబంధమున్న ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఖురేషి వెల్లడించారు.

నిందితులలో ఐదుగురు మహారాష్ట్రలోని ఒకే గ్రామానికి చెందిన వారు కాగా, ఇద్దరు ఒరిస్సాకు చెందిన వారని జాయింట్​ డైరెక్టర్​ తెలిపారు. ఈ కేసులో నిందితుల నేర చరిత్రను పరిశీలించి పీడీ యాక్టు నమోదు చేస్తామని వివరించారు. ఒరిస్సాలో గంజాయిని సాగుచేసి పెద్ద ఎత్తున ప్యాకింగ్​ చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిపారు. నిందితుల నుంచి రెండు వాహనాలు, 8 సెల్​ఫోన్​లను స్వాధీనం చేసుకుని హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.