Government Remove Security of Swaroopanandendra Swamy : విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కుదించింది. వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసు మినహా మిగతా అందరిని ప్రభుత్వం తొలగించింది. అదేవిధంగా పీఠం ఉత్తరాధికారి అయిన స్వాత్మానందేంద్ర స్వామికిి పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించింది. గత ప్రభుత్వంలో శారదాపీఠం స్వరూపనదేంద్ర స్వామీజీకి సెక్యూరిటీ నిమిత్తం 2+2 గన్ మాన్, ఎస్కార్ట్ వాహనంతో పాటు 15 మందికి పైగా సిబ్బంది పీఠం వద్ద విధులు నిర్వహించేవారు. స్వామీజీ బయటకు వస్తే ఎస్కార్ట్ వాహనం ద్వారా ట్రాఫిక్ ను నియంత్రించేవారు. నిరంతరం పహారా కోసం శారదా పీఠం ప్రవేశ ద్వారం వద్దే మూడు షిఫ్ట్ లు కలసి 15 మంది ఉండే వారు. గత ప్రభుత్వంలో స్వరూపానదేంద్ర స్వామీజీ రాజా గురువుగా, ప్రభుత్వ దేవాదాయశాఖను నియంత్రించినట్లు అభియోగాలు ఉన్నాయి.
విశాఖ శారదా పీఠం స్వాముల భద్రత కుదింపు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 10:00 PM IST