ETV Bharat / snippets

చాక్లెట్ల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం - మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 10:59 PM IST

Fire Accident In Hyderabad
Fire Accident In Chocolate Company In Hyderabad (ETV Bharat)

Fire Accident In Chocolate Company at Hyderabad : హైదరాబాద్​లోని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి భాగ్యలక్ష్మి కాలనీలోని చాక్లెట్ల తయారీ కంపెనీలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చాక్లెట్‌ పౌడర్‌ను వేడి చేసే క్రమంలో గ్యాస్‌ లీక్‌ అవ్వడంతో ప్రమాదం జరిగింది. దీంతో దట్టమైన పొగలతో పాటు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇళ్ల మధ్యలో ఉన్న కంపెనీలో మంటలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.