ETV Bharat / snippets

గ్రేటర్ వరంగల్ ఖాతాలో మరో అవార్డు - నైబర్ హుడ్ ఛాలెంజ్ పోటీలో ఎక్స్​లెన్స్ సర్టిఫికెట్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 10:31 AM IST

GREATER WARANGAL CITY AWARDS
Excellance Award For Greater Warangal (ETV Bharat)

Excellance Award For Greater Warangal : గ్రేటర్ వరంగల్ ఖాతాలో మరో అవార్డు చేరింది. నైబర్ హుడ్ ఛాలెంజ్ పోటీలో బల్దియాకు ఎక్స్​లెన్స్ సర్టిఫికెట్ లభించింది. బెంగుళూరు, ఇండోర్, జబల్​పూర్, కొచ్చి నగరాల సరసన గ్రేటర్ వరంగల్ నిలవడంతో ఈ సర్టిఫికేట్​ వరించింది. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి, గృహ మంత్రిత్వ శాఖల (ఎంఓహెచ్​యుఏ) ఆధ్వర్యంలో దిల్లీలో స్మార్ట్ సిటీ నగరాలకు సంబంధించిన సమావేశం జరిగింది.

గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ (ఎన్​ఎన్​సీ) పోటీల్లో ఇతర నగరాలతో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన తొలి టాప్​-5 నగరాలకు ఈ అవార్డు అందించారు. వరంగల్ మహా నగరం ఈ అవార్డు దక్కించుకోవడం, ఉత్తమ నగరాల సరసన చోటు దక్కడంపై నగర మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.