ETV Bharat / snippets

తాడిపత్రి అల్లర్లపై పొంతన లేని జవాబులు - అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీపై వేటు

Election Violence in Tadipatri
Election Violence in Tadipatri (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 9:53 PM IST

Election Violence in Tadipatri: అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. అనంతపురం రేంజ్‌ డీఐజీ లక్ష్మీనారాయణ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. తాడిపత్రిలో అల్లర్ల వేళ అదనపు బలగాలు కావాలని పూర్వ ఎస్పీ అమిత్‌ బర్దర్‌ కోరగా, లక్ష్మీనారాయణ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు సమాచారం. అదనపు బలగాలు లేకపోవడంతోనే అల్లర్లు పెరిగాయని అమిత్‌ బర్దర్‌ నివేదించారు.

అమిత్ బర్దర్‌పై ఎన్నికల సంఘం వేటు వేసిన తర్వాత ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌతమి సాలి తాడిపత్రి ఘటనల వైఫల్యాన్ని లోతుగా పరిశీలన చేస్తున్నారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని పిలిచి వివరాలు కోరగా, ఎస్పీ గౌతమి సాలి వద్ద ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. లక్ష్మీనారాయణ తీరుపై గౌతమ్‌ సాలి ఫిర్యాదు చేయడంతో, ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.