ETV Bharat / snippets

తుంగభద్ర డ్యామ్ గేటు ఘటన - జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు!

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 1:50 PM IST

Jurala Project Safety
Jurala Project Gates Safety (ETV Bharat)

Jurala Project Gates Safety : ఇటీవల కాలంలో జలాశయాల గేట్లు కొట్టుకుపోతున్న సందర్భాలు తరచూ చూస్తున్నాం. తాజాగా కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో నీరంతా దిగువకు వృథాగా పోతోంది. గత సంవత్సరం కడెం ప్రాజెక్టు పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల డ్యాం భద్రతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టు గేట్లకు చాలా లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ విషయం కొంత ఆందోళన కలిగిస్తోంది. వీటికి మరమ్మతులు చేపట్టాలని నిపుణులు చాలా ఏళ్ల నుంచి సూచిస్తునే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2021లో కొన్ని నిధులు కేటాయించింది. కానీ సాంకేతిక సమస్యలు, నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో మొత్తం 62 గేట్లలో కేవలం ఐదింటికి మాత్రమే మరమ్మతులు జరిగాయని ప్రాజెక్టు ఈఈ జుబేర్‌ అహ్మద్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.