ETV Bharat / snippets

అన్న క్యాంటీన్లకు సెల్‌కాన్ సీఎండీ విరాళం - సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 7:14 PM IST

Celkon CMD Donation to Anna Canteens
Celkon CMD Donation to Anna Canteens (ETV Bharat)

Celkon CMD Donation to Anna Canteens: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న అన్నక్యాంటీన్లకు విరాళం అందించేందుకు ప్రజలు, దాతలు విరివిగా ముందుకొస్తున్నారు. సీఎం చంద్రబాబుని హైదరాబాద్​లోని ఆయన నివాసంలో వ్యాపారవేత్త, సెల్​కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు కలిసి 26.25 లక్షల రూపాయలను అన్నక్యాంటీన్లకు విరాళంగా అందించారు. ఈ నెల 31వ తేదీన తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 అన్నక్యాంటీన్లలో భోజనం ఖర్చుకు ఆ మొత్తాన్ని ఖర్చు చేయాలని సీఎంని కోరారు.

వేలమంది కడుపు నింపుతున్న ఈ కార్యక్రమంలో తన వంతుగా ఈ విరాళం ఇచ్చినట్లు గురుస్వామి నాయుడు తెలిపారు. గురుస్వామి నాయుడుని సీఎం చంద్రబాబు అభినందించారు. అన్నక్యాంటీన్ల నిర్వహణలో భాగస్వాములయ్యేందుకు వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారులు ముందుకు రావడం అభినందనీయమని సీఎం అన్నారు. పేదల కడుపు నింపే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ఎవరైనా తమకు తోచిన స్థాయిలో విరాళం అందించవచ్చని సీఎం అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.