ETV Bharat / snippets

ఏసీబీ ట్రాప్‌- రూ.3లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీసీఎస్ సీఐ

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 9:39 PM IST

CCS CI RS 3 LAKH BRIBE CASE
CCS CI caught by ACB taking Bribe (ETV Bharat)

CCS CI caught by ACB taking Bribe : ఓ కేసు పరిష్కారం విషయంలో, కేసు నమోదైన వ్యక్తి నుంచి రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ, సీసీఎస్ సీఐ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బోయిన్‌పల్లికి చెందిన శ్రీ మణి రంగస్వామిపై సీసీఎస్‌లో ఓ కేసు నమోదు అయింది. శ్రీ మణి రంగస్వామి కేసును విచారిస్తున్న డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ టీం 7లో పని చేస్తున్న సీఐ చామాకురి సుధాకర్, కేసును అతనికి అనుకూలంగా క్లోస్ చేసేందుకు 15 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. తొలి విడతగా 5 లక్షలు అతని నుంచి తీసుకున్నాడు. రెండో విడతగా మూడు లక్షలు సీఐకు సీసీఎస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్లేస్‌లో అతని కారులో పెడుతున్న సమయంలో, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మూడు లక్షలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.