ETV Bharat / snippets

పోలీస్​ ఉద్యోగాలవైపే బీటెక్ విద్యార్థుల మొగ్గు - 46 శాతం వారే

Btech Students Interest In Police Jobs
Btech Students Interest In Police Jobs (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 7:58 AM IST

Btech Students Interest In Police Jobs : పోలీస్ ఉద్యోగాలకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు బీటెక్​ బాబులు. దరఖాస్తుల్లోనే కాదు శిక్షణ పూర్తి చేసుకుని పోస్టింగ్​కు ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో 46 శాతం వారే ఉన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 2023 బ్యాచ్​లోని 547 మందిలో 248 మంది బీటేక్ పూర్తి చేసిన వారే కావడం గమనార్హం. వీరే కాదు ఎంటెక్, ఎం. ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీలు చేసిన వారు 75 మంది విద్యార్థులు ఉన్నారు.

35 - 42 ఏళ్ల మధ్య వయసున్న 24 మంది శిక్షణ పూర్తి చేసుకున్న వారున్నారు. 547 మందిలో 145 మంది మహిళలు ఉన్నారు. కొంతమంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నా, వాటిని వదిలేసి మరీ ఎస్సై ఉద్యోగాలు సాధించడంతో యూనిఫామ్​ సర్వీసుకున్న డిమాండ్ ఏంటో తెలుస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.