ETV Bharat / snippets

రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను వంచిస్తోంది : నిరంజన్​ రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 7:27 PM IST

BRS Leader Niranjan Reddy on Loan Waiver
BRS Leader Niranjan Reddy on Loan Waiver (ETV Bharat)

BRS Leader Niranjan Reddy on Loan Waiver : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను వంచిస్తోందని, ఆంక్షలు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఉత్తర్వులను ఎందుకు సవరించలేదని మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్​ పార్టీ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకం ప్రామాణికంగా రుణమాఫీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కనీసం ఐదు ఎకరాల లోపు ఉన్నవారికైనా తక్షణమే రైతు భరోసా ఇవ్వాలని సూచించారు. రైతు భరోసా ఇవ్వకుండా కొంత రుణమాఫీ చేసి మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆక్షేపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.