ETV Bharat / snippets

కళాశాలల్లో రక్షణ లేకపోతే ఎలా? - గుడ్లవల్లేరు ఘటనపై విచారణకు షర్మిల డిమాండ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 2:59 PM IST

ys_sharmila_demands_on_gudlavalleru_college_incident
ys_sharmila_demands_on_gudlavalleru_college_incident (ETV Bharat)

Ys Sharmila Demands on Gudlavalleru College incident : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురి చేసిందని ఆమె వ్యాఖ్యానించారు. చదువు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో ఈ ఘటన పడేసిందని అన్నారు. కాసుల కక్కుర్తి తప్ప భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారని షర్మిల ఆక్షేపించారు. ఘటనపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలన్నారు. తక్షణం ఉన్నతస్థాయి కమిటి వేసి సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారం లోపు చర్యలు చేపట్టకపోతే తాను స్వయంగా కళాశాలను సందర్శిస్తానని షర్మిల ప్రకటించారు. విద్యార్ధులు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.