ETV Bharat / snippets

తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు - ప్రోటోకాల్ పాటించని ఇన్‌ఛార్జి ఈవో

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 10:20 PM IST

AP CM Chandrababu
AP CM Chandrababu (ETV Bharat)

AP CM Chandrababu Reached at Tirumala: తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. ఈ రాత్రికి చంద్రబాబు కుటుంబసభ్యులు తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం 8 గం.కు శ్రీవారి సేవలో చంద్రబాబు, కుటుంబసభ్యులు పాల్గొంటారు. అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్‌, ఎస్పీ హర్షవర్ధన్‌ స్వాగతం పలికారు.

సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకున్నప్పటికి, ప్రోటోకాల్ విషయంలో తితిదే అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు తితిదే ఇన్‌ఛార్జి ఈవో వీరబ్రహ్మం వాహనం వద్దకు రాలేదు. సీఎంను అవమానపరిచేలా వ్యవహరించారు. గాయత్రినిలయం భవనం లోపలకు వెళ్లాక, ఇంఛార్జి ఈఓ వీరబ్రహ్మం పూలబొకే ఇచ్చేందుకు యత్నించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆ పూలబొకేను తిరస్కరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.