ETV Bharat / snippets

పోస్టల్​శాఖ నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఓ యువకుడు

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

NEGLIGENCE OF POSTAL DEPARTMENT
A YOUNG MAN LOST HIS GOVT JOB (ETV Bharat)

Jadcherla Post Office: పోస్టల్ శాఖ నిర్లక్ష్యంతో ఓ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయిన ఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే గంగాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి విద్యుత్ శాఖలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు రావాలని కాల్​ లెటర్ వచ్చింది. పోస్ట్​ మ్యాన్​ ఇంటర్వ్యూ సమయం అయిపోయిన తర్వాత అతనికి లెటర్ అందించడంతో నాగరాజు ఉద్యోగం కోల్పోయాడు.

సెప్టెంబర్ 27న అతనికి ఇంటర్వ్యూ ఉండగా, అక్టోబర్ 4వ తేదిన కాల్ లెటర్ అందింది. వెంటనే వెళ్లి ఉద్యోగం వచ్చిన కార్యాలయంలో సంప్రదించగా ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఉద్యోగం ఇవ్వలేమని చెప్పడంతో బాధతో వెనుదిరిగాడు. ఈరోజు(అక్టోబర్​ 08) జడ్చర్ల పోస్ట్ ఆఫీస్ అధికారులను సంప్రదించగా వారు జరిగిన విషయంపై విచారణ జరిపి పోస్ట్​మ్యాన్​పై తగు చర్యలు తీసుకుంటామని అడిషనల్ పోస్ట్ అధికారి రవికుమార్ తెలిపారు. ఈ విషయంలో పోలీసులను ఆశ్రయిస్తానని అభ్యర్థి నాగరాజు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.