ETV Bharat / snippets

భారత్-పాక్ మ్యాచ్‌ - అభిమానులకు ఫ్రీ ఎంట్రీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 6:23 PM IST

source ANI
Womens Asiacup 2024 (source ANI)

Womens Asiacup 2024 : మహిళల ఆసియా కప్ 9న ఎడిషన్ జులై 19 నుంచి మొదలుకానుంది. జులై 28న ఫైనల్ జరగనుంది. టీ20 ఫార్మాట్‌లో దీన్ని నిర్వహించనున్నారు. శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌తో కలిపి మొత్తం 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే జులై 19న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌(IND VS PAK) తలపడనున్నాయి. అయితే ఈ పోరు కోసం లంక క్రికెట్‌ బోర్డు ఫ్యాన్స్​కు అదిరిపోయే వార్త చెప్పింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు ఉచిత ఎంట్రీ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. మహిళల క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

కాగా, ఈ ఆసియాకప్‌లో ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా డివైడ్ చేశారు. గ్రూప్‌ ఎలో టీమ్​ఇండియా, పాకిస్థాన్, నేపాల్, యూఏఈ ఉన్నాయి. గ్రూప్ బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌ ఆడతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.