ETV Bharat / snippets

టీ20 వరల్డ్​కప్​లో శ్రీలంక ఫెయిల్​ - అప్పుడు కోచ్, ఇప్పుడు కెప్టెన్ రాజీనామా

Wanindu Hasaranga Srilanka Captaincy
Wanindu Hasaranga (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 9:24 PM IST

Wanindu Hasaranga Srilanka Captaincy : 2024 టీ20 ప్రపంచ కప్‌లో పేలవ ఫామ్ కనబరిచిన శ్రీలంక సూపర్‌-8కు కూడా చేరుకోలేకపోయింది. దీంతో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆ జట్టు కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌వుడ్ తాజాగా తన పదవికి రాజీనామా చేశాడు. అయితే కెప్టెన్‌ వానిందు హసరంగ కూడా తన కెప్టెన్సీని వదులుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు తాజాగా ఒక ప్రకటన చేసింది. అందులో జాతీయ జట్టు తరఫున ఎల్లప్పుడూ అత్యుత్తమ పెర్ఫామెన్స్ కనబరుస్తానని, జట్టు నాయకత్వానికి తన మద్దతు ఉంటుందంటూ హసరంగ పేర్కొన్నాడు.

ఇక జులై​ నెలాఖరులో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. లంకతో జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు, ఆగస్టు 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది. ఇక బీసీసీఐ కూడా ఈ సిరీస్‌లకు తమ తుది జట్లను త్వరలోనే అనౌన్స్ చేయనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.