ETV Bharat / snippets

ఒలింపిక్స్​ అభిమానులకు షాకింగ్ న్యూస్ : ఆ వాటర్ ఈవెంట్​లో మార్పులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 12:16 PM IST

Paris 2024 Olympics Triathlon
Paris 2024 Olympics Triathlon (Associated Press)

Paris 2024 Olympics Triathlon : పారిస్​ ఒలింపిక్స్​లో భాగంగా జరగాల్సిన స్విమ్మింగ్ ట్రైయాథ్లాన్‌ తొలి ట్రైనింగ్‌ సెషన్‌ను తాజాగా అక్కడి నిర్వాహకులు రద్దు చేశారు. ప్రసిద్ధ సెన్‌ నదిని కాలుష్యం చుట్టుముట్టిన కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు.

"సెన్​ నదిలోని నీటి క్వాలిటీని దృష్టిలో ఉంచుకుని మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అందుకోసమే ట్రైయాథ్లాన్‌ ట్రైనింగ్ సెషన్​ను రద్దు చేస్తున్నాం. అథ్లెట్ల ఆరోగ్యంపై మేము ప్రత్యేక శ్రద్ధతో ఉన్నాం. ఆ నది నాణ్యతను మరోసారి చెక్​ చేస్తాం. అయితే ఎప్పుడు పర్మిషన్ ఇస్తామనేది ఇప్పుడే చెప్పలేం" అని నిర్వాహకులు తెలిపారు.

జులై 30న ఈ పోటీలు ప్రారంభం కానుందున ఒకవేళ అప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం దొరక్కపోతే ఒలింపిక్స్ మేనేజ్​మెంట్​ వద్ద ప్లాన్‌ B ఉన్నట్లు తెలుస్తోంది. పోటీలను కొద్దిరోజులకు వాయిదా వేయడం లేకుంటే మారథాన్‌ స్విమ్మింగ్‌ను పారిస్‌కు తూర్పు దిక్కున ఉన్న మార్నె రివర్‌లో నిర్వహించడానికి ప్లాన్ చేయనున్నారట.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.