ETV Bharat / bharat

35ఏళ్లలో 35కోట్ల సార్లు 'రామ'నామం! ఎన్నో పుస్తకాలు ఫుల్​- వందలు పెన్నులు నిల్​!! - Uttarakhand Devotee Ramakoti - UTTARAKHAND DEVOTEE RAMAKOTI

Uttarakhand Devotee Ramakoti : శ్రీరాముడిపై అపారమైన భక్తితో 35 కోట్ల సార్లు రామనామాన్ని రాశాడు ఉత్తరాఖండ్​కు చెందిన ఓ ఛాయ్ వాలా. గత 35 ఏళ్లుగా ఖాళీ దొరికినప్పుడల్లా ఆయనకు శ్రీరామ నామం రాయడమే పని. అందుకు ఓ కారణం ఉంది. అదేంటంటే?

Uttarakhand Devotee Ramakoti
Uttarakhand Devotee Ramakoti (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 12:53 PM IST

Updated : Sep 8, 2024, 1:47 PM IST

Uttarakhand Devotee Ramakoti : ఉత్తరాఖండ్ అల్మోడా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రాముడిపై తన భక్తిని చాటుకున్నాడు. ఏకంగా 35 కోట్ల సార్లు రామనామాన్ని రాశాడు. అందుకే ఆయనను సమీప ప్రాంత ప్రజలు కలియుగ రాముడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా అభివర్ణిస్తుంటారు. మరెందుకు ఆలస్యం ఈ రామభక్తుడి గురించి తెలుసుకుందాం.

35ఏళ్లలో 35కోట్ల సార్లు 'రామ'నామం! ఎన్నో పుస్తకాలు ఫుల్​- వందలు పెన్నులు నిల్​!! (ETV Bharat)

పేదవాళ్లకు టీ ఫ్రీ!
అల్మోడా జిల్లాలోని మౌలేఖల్‌ గ్రామానికి చెందిన శంభు దయాళ్ అనే వ్యక్తి చిన్న టీ దుకాణన్ని నడుపుతున్నాడు. అందులో 2-3 మాత్రమే కూర్చొని టీ తాగొచ్చు. ఎవరైనా ఫకీర్ లేదా పేదవాడు తన దుకాణానికి వచ్చి టీ తాగితే శంభు డబ్బులు తీసుకోడు. శంభు దయాళ్​కు భార్య దేవకీదేవి, నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ఇద్దరు దివ్యాంగులు.

35ఏళ్లుగా రామనామం రచన
శంభు దయాళ్​కు రాముడు అంటే చాలా ఇష్టం. అతడి జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా రామయ్యపై భక్తి మాత్రం తగ్గలేదు. అందుకే గత 35 ఏళ్లుగా ఖాళీ దొరికినప్పుడల్లా రాముడి పేరును రాసేవాడు. ఇప్పటివరకు 35 కోట్ల సార్లు రామనామాన్ని పెన్నుతో రాశాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రామనామం రాయడం మర్చిపోననని చెప్పాడు శంభు. ప్రపంచ శాంతి కోసమే తాను రామనామాన్ని రాస్తున్నానని అన్నాడు.

Ram devotee Shambhu Dayal
శంభు దయాల్ రాసిన రామనామాల పుస్తకాలు (ETV Bharat)

"రామయ్య దయతోనే నా కుటుంబం బతుకుతోంది. నా గురువు నుంచి ప్రేరణ పొంది గత 35ఏళ్లుగా రామనామాన్ని రాస్తున్నాను. ప్రపంచ శాంతి కోసం రామయ్య పేరును కోట్లాది సార్లు లిఖిస్తున్నాను. ఇంకా రామయ్య నామాన్ని రాస్తూనే ఉంటాను. గిన్నిస్ బుక్ లో నా పేరు నమోదు కావాలనుకుంటున్నాను. జీవితాంతం రామనామాన్ని జపిస్తాను"అని రామ భక్తుడు శంభు దయాల్ తెలిపాడు.

Ram devotee Shambhu Dayal
శంభు దయాల్ (ETV Bharat)

వందలాది పెన్నులు ఖాళీ
కాగా, రామనామం రాయడానికి శంభు వందలాది పెన్నులను వాడాడు. అవన్నీ ఖాళీ అయిపోయాయి. అలాగే వందలాది నోట్ పుస్తకాలను కూడా రామనామంతో నింపేశాడు. మరోవైపు, రాముడిపై ఇంత భక్తి ఉన్న వ్యక్తిని ఎక్కడా చూడలేదని శంభు దయాళ్​ను ఉద్దేశించి స్థానికులు అంటున్నారు. శంభు రామనామం రాయడాన్ని చాలా ఏళ్లు నుంచి చూస్తున్నామని చెబుతున్నారు. అందుకు అనేక కాపీలు, వందలాది పెన్నులే సాక్ష్యమని అంటున్నారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో శంభు పేరు నమోదు అవ్వాలని అభిప్రాయపడ్డారు.

Last Updated : Sep 8, 2024, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.