ETV Bharat / snippets

బాక్సింగ్​లో భారత్​కు అన్యాయం- నిషాంత్ నుంచి మెడల్ దోచేశారు!

author img

By ETV Bharat Sports Team

Published : Aug 4, 2024, 7:15 AM IST

Updated : Aug 4, 2024, 10:17 AM IST

Nishant Dev Olympics
Nishant Dev Olympics (Source: Associated Press)

Nishant Dev Olympics: పారిస్ ఒలింపిక్స్​ బాక్సింగ్ ఈవెంట్​లో భారత్​కు ఎదురుదెబ్బ. శనివారం జరిగిన 71కేజీల బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్​ ఈవెంట్​లో నిషాంత్ దేవ్ పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్​లో మెక్సికన్ బాక్సర్ మార్కో అలోన్సోతో తలపడ్డ నిషాంత్ గట్టిపోటీ ఇస్తూ చివరిదాకా పోరాడాడు. దీంతో అందరూ నిషాంత్​దే విజయం అనుకున్నారు. కానీ, ఆఖర్లో అంపైర్ మెక్సికన్ బాక్సర్​ను 3-2 పాయింట్లతో విజేతగా ప్రకటించడం వల్ల నిషాంత్ ఓటమి ఖరారైంది.

కాగా,వరల్డ్​ ఛాంపియన్​షిప్​ కాంస్యం విజేత నిషాంత్ దేవ్ క్వార్టర్స్​లో ఓడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు ఈ మ్యాచ్​లో స్కోరింగ్​పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు నిషాంత్​కు మద్దతుగా మాజీ ఛాంపియన్ విజేందర్ సింగ్ పోస్ట్​ షేర్ చేశాడు. 'పాయింట్లు ఎలా వేశారో అర్థం కాలేదు. నిషాంత్ నువ్వు బాధపడకు అద్భుతంగా పోరాడావు' అని అన్నాడు. 'విజయం నీదే, నీ నుంచి మెడల్ దోచేశారు' అని నటుడు రణ్​దీప్ హుడా అన్నారు.

Last Updated : Aug 4, 2024, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.