ETV Bharat / snippets

వైఎస్సార్సీపీకి షాక్- పార్టీకి గుడ్​బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 22, 2024, 5:41 PM IST

Maddali_Giri_Resigned_to_YSRCP
Maddali_Giri_Resigned_to_YSRCP (ETV Bharat)

Maddali Giridhar Resigned to YSRCP: గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, గుంటూరు నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మద్దాలి గిరిధర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. వ్యక్తి గత కారణాల వల్ల తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలోకి వెళ్లారు. కీలకమైన అమరావతి ఉద్యమ సమయంలో మద్దాలి గిరి పార్టీ ఫిరాయించటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. 2024లో వైఎస్సార్సీపీ నుంచి తనకే టికెట్ వస్తుందని గిరి భావించారు. అయితే అనూహ్యంగా అప్పటి మంత్రి విడదల రజినిని వైఎస్సార్సీపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. దీంతో ఆయన మౌనం దాల్చారు. ఎన్నికల సమయంలో కూడా క్రియాశీలకంగా పని చేయలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.