Liquor Sells In Container At Visakhapatnam : ఏపీలో కొత్త మద్యం దుకాణాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గత సర్కార్‌లో నాసిరకం లిక్కర్ అమ్మారని మందుబాబులు ఆరోపించారు. ఊరుపేరు లేని లిక్కర్ ముంచెత్తిందని విమర్శించారు. ఏన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు లభిస్తుందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మద్యం దుకాణదారుల పరిస్థితి మాత్రం 'అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని' అని విధంగా తయారయ్యింది. ఓ దుకాణాదారుడు మాత్రం వినూత్నంగా ఆలోచించి తన సమస్యను పరిష్కరించుకొని మందుబాబుల కళ్లలో ఆనందాన్ని చూశాడు. అదేలా అంటారా!
అద్దెకు దొరకని మద్యం షాపులు : రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్ కేటాయించారు. లైసెన్స్ పొందిన వారంతా నేటి నుంచి షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల లైసెన్స్‌దారులు ప్రాంగణాలను చూసుకునే పనిలో పడ్డారు. విజయవాడ, విశాఖపట్నం నగరంలో ఇప్పటికిప్పుడు అద్దెకు షాపులు దొరకలేదు. ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూళ్లు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. నిబంధనల మేరకు చాలాచోట్ల షాపులు దొరకడం లేదు. రాష్ట్రంలో చాలా మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు.
రమణా - ఆ డబ్బెక్కడ? ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గోల్‌మాల్
కంటైనర్‌లోనే మద్యం దుకాణం : విశాఖ మహా నగరంలో నూతన విధానంలో లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు అమ్మకాలు ప్రారంభించారు. ఈ మహా నగరంలో ఒక్క రోజు విక్రయాలు ఆగినా భారీగా ఆదాయం కోల్పోయినట్లే. ఓ లైసెన్స్‌దారు అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి వద్ద దుకాణం ఏర్పాటు చేయాలనుకున్న చోట భవనం నిర్మాణంలో ఉంది. అద్దెకు గుదులు దొరకలేదు. ఆలస్యం చేస్తే వచ్చే ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. దీంతో ఆలస్యం చేయకుండా ఇదిగో ఇలా కంటైనర్‌లోనే దుకాణం ప్రారంభించేశారు. భవనం పూర్తి కాగానే అందులోకి మార్చుతామని అంటున్నారు. తన వెరైటీగా కంటైనర్ ఆలోచనతో సమస్యను పరిష్కరించుకున్నారు.
" జే " బ్రాండ్లకు చెల్లు- ఇక కోరుకున్న మందు- నాలుగు బ్రాండ్ల క్వార్టర్ ధర రూ. 99
ఏపీలో మద్యం దుకాణాలకు 90వేల దరఖాస్తులు! - అత్యధికంగా ఆ జిల్లా నుంచే