ETV Bharat / snippets

ఏపీలో కూటమికి జైకొట్టిన యాక్సిస్‌ ఇండియా టుడే సర్వే

Exit Poll
Exit Poll (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 8:21 PM IST

Updated : Jun 2, 2024, 8:45 PM IST

India Today Axis My India Exit Poll: రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిదే అధికారమని, ఇండియా టుడే- మై యాక్సిస్‌ కూడా తేల్చిచెప్పింది. దాదాపు అన్ని కీలక సర్వేలు కూటమికే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఇండియా టుడే- మై యాక్సిస్‌ కూడా చేరింది. తెలుగుదేశం సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మిత్రపక్షాలు జనసేన 16 నుంచి 18 స్థానాల్లో, బీజేపీ 4 నంచి 6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. మొత్తంగా ఎన్డీఎకు 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్‌ ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించింది. ఇక అధికార వైఎస్సార్సీపీ 55 నుంచి 77 స్థానాలు వస్తాయని జోస్యం చెప్పింది. కాంగ్రెస్‌కు 0 నుంచి 2 సీట్లు వస్తాయని తెలిపింది.

Last Updated : Jun 2, 2024, 8:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.