ETV Bharat / snippets

ఏడు నెలల పాలనకే కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : కేసీఆర్​

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 7:11 PM IST

KCR Meeting with ZP Chairmans
BRS Chief KCR Athmiya Samavesam (ETV Bharat)

Ex CM KCR Meet with Zilla Parishad Chairmans : మూడు రోజుల విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆత్మీయ సమావేశాలను పునఃప్రారంభించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు చెందిన జిల్లా పరిషత్ ఛైర్మన్లు హాజరయ్యారు. అందులో భాగంగానే 17 జిల్లాల ఛైర్మన్​లు హాజరుకాగా, మరో నలుగురు గైర్హాజరు కావటం గమనార్హం.

ఈ భేటీలో ప్రధానంగా ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ పరిస్థితి, రాజకీయ సమీకరణాలపై కేసీఆర్ చర్చించారు. ఏడు నెలల పాలనకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఉద్ఘాటించారు. రాబోయే రోజులు తమవేనని గులాబీ బాస్​ అన్నారు. అదేవిధంగా ధైర్యంగా ఉండాలని జడ్పీ ఛైర్మన్లకు కేసీఆర్​ సూచించారు. సమావేశం ముగిసిన అనంతరం పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసీఆర్​తో కలిసి ఫొటోలు దిగారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.