Maldives President On India : భారత్తో అంటీముట్టనట్లు ఉండే మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు మరోసారి మాట మార్చారు. భారతదేశం తమకు అత్యంత సన్నిహిత మిత్ర దేశమని, ఎంతో విలువైన భాగస్వామని శనివారం కొనియాడారు. తమ దేశానికి అవసరమైనవన్నీ సమకూరుస్తున్నది భారతదేశమేని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ రుణంతో మాల్దీవుల్లో నిర్మించిన అతి పెద్ద తాగు నీరు, మురుగు శుద్ధి కేంద్రాలను ప్రారంభించిన సందర్భంగా ముయిజ్జు ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల పర్యటన కోసం మాల్దీవులకు వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాల్దీవులతో అన్ని విధాలుగా సహకారాన్ని వృద్ధి చేసుకోవాలని భారత్ ఆశిస్తోందని ముయిజ్జు తదితర నాయకులకు జైశంకర్ భరోసా ఇచ్చారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) డిజిటల్ చెల్లింపులను మాల్దీవుల్లో ప్రవేశపెట్టడానికి జైశంకర్ పర్యటన సందర్భంగా రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
'భారత్ మాకు అత్యంత సన్నిహత దేశం' - మాట మార్చిన మాల్దీవుల అధ్యక్షుడు
Published : Aug 11, 2024, 9:10 AM IST