Sharwanand New Tag : సపోర్టింగ్ రోల్స్‌లో మెరిసి, హీరోగా టాప్ పొజిషన్‌కు చేరుకుని టాలీవుడ్లో మంచి స్టార్డమ్ సంపాదించారు నటుడు శర్వానంద్. తన నేచురల్ యాక్టింగ్‌తో పక్కింటి కుర్రాడిగా కనిపించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ యంగ్ హీరోకు ఎటువంటి ట్యాగ్ లేకపోవడం గమనార్హం. కానీ ఇకపై ఈయన్ను ఫ్యాన్స్ ఓ కొత్త పేరుతో పిలవనున్నారు.
శర్వానంద్ తాజాగా 'మనమే' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో నటించారు. ఈ చిత్రం జూన్ 7న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇందులో 'మనమే' నిర్మాత ఈ యంగ్ హీరోకు ఛార్మింగ్ స్టార్ అనే టైటిల్‌ను ఇచ్చారు. సినిమా టైటిల్ క్రెడిట్స్లోనూ అదే వాడామని పేర్కొన్నారు. ఇది విన్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై తాము శర్వాను ఛార్మింగ్ స్టార్ అని పిలుస్తామంటున్నారు.