ETV Bharat / snippets

'గేమ్​ఛేంజర్'​ - రామ్​చరణ్​కు బిగ్ రిలీఫ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 6:27 PM IST

Source ETV Bharat
Gamechanger (Source ETV Bharat)

Shankar Ramcharan Gamechanger Shooting : రామ్​చరణ్-శంకర్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ ఆలస్యంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. మధ్యలో ఇండియన్ 2 టేకప్ చేయాల్సిన పరిస్థితి రావడంతో దర్శకుడు శంకర్ అటో కాలు, ఇటో కాలు వేసి షూట్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ ఏడాది ఎలాగైనా రిలీజ్​ చేయాలన్నది నిర్మాత దిల్​రాజు ప్లాన్. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. రామ్​చరణ్ పాత్ర షూట్ పూర్తైనట్లు తెలిసింది. ఇక మిగిలింది డబ్బింగ్, ప్రమోషన్స్​ మాత్రమే. దీంతో చరణ్​కు తన నెక్ట్స్​​ సినిమాపై ఫోకస్​ పెట్టేందుకు అవకాశం దొరికింది. అసలే ఇప్పటికే చరణ్ కోసం చాలాకాలంగా వెయిటింగ్​లో ఉన్నారు బుచ్చిబాబు. ఇప్పటికే స్క్రిప్ట్​ వర్క్​తో పాటు ప్రీప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తైంది. కాబట్టి చరణ్ డేట్​లు ఇస్తే చాలు. సినిమా ముందుకెళ్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.