ETV Bharat / snippets

'టైటానిక్' మూవీ ప్రొడ్యూసర్ మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 6:58 AM IST

Titanic Producer Died
Titanic Producer Died (Source: Associated Press)

Titanic Producer Died: హాలీవుడ్ బ్లాక్​బస్టర్స్​ 'టైటనిక్', 'అవతార్' సినిమాల ప్రొడ్యూసర్ జాన్ లాండౌ మృతిచెందారు. 63 ఏళ్ల జాన్ శనివారం మరణించినట్లు సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. అయితే మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, 1980ల్లో ప్రొడక్షన్ మేనేజర్​గా కెరీర్ ప్రారంభించిన జాన్ హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక ఆయన నిర్మించిన 'టైటనిక్' సినిమాకుగాను ఉత్తమ నిర్మాతగా ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్నారు. 1997 రిలీజైన ఈ సినిమా అప్పట్లోనే 1 బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి అనేక రికార్డులు బ్రేక్ చేసింది. ఇక ఇదే సినిమాకుగాను ఆయా కేటగిరీల్లో 11 ఆస్కార్ పురస్కారాలు దక్కాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.