ETV Bharat / snippets

బాలీవుడ్ స్టార్లకు అంబానీ సర్​ప్రైజ్​- గిఫ్ట్​గా రూ.2 కోట్ల వాచ్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 12:57 PM IST

Ambani Gifts
Ambani Gifts (Source: Associated Press)

Ambani Gifts 2Crore Watch: రిలయన్స్ అధినేత ముకేశ్‌- నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధిక పెళ్లి శుక్రవారం గ్రాండ్​గా జరిగింది. ముంబయి బాంద్రాలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఈ కల్యాణానికి వేదికగా నిలిచింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్​కు బాలీవుడ్ సహా ఆయా ఇండస్ట్రీల సెలబ్రిటీలంతా హాజరై సందడి చేశారు. హుషారుగా స్టెప్పులేస్తూ వెడ్డింగ్​లో హైలైట్​గా నిలిచారు. అయితే తన వివాహానికి హాజరైన ఫ్రెండ్స్​కు అనంత్ అంబానీ ఖరీదైన వాచీలను గిఫ్ట్​గా ఇచ్చి సర్​ప్రైజ్ చేశారు.

అడెమార్స్‌ పిగ్యుట్‌ బ్రాండ్‌కు చెందిన ఈ వాచీ ధర సుమారు రూ.1.5 కోటి- రూ.2 కోట్ల దాకా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇక బాలీవుడ్ హీరోలు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ఈ వాచీలు ధరించి సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. కాగా, అనంత్- రాధిక వెడ్డింగ్​కు దాదాపు రూ.5వేల కోట్ల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.