ETV Bharat / snippets

ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ది గోట్‌ లైఫ్‌' - ఎక్కడ చూడొచ్చంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 3:09 PM IST

Aadujeevitham OTT
Prithviraj Sukumaran (ETV Bharat)

Aadujeevitham OTT : మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన బ్లాక్​బస్టర్ 'ఆడు జీవితం' (ది గోట్‌ లైఫ్‌) మూవీ ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 19 నుంచి ఇది స్ట్రీమ్​ కానుంది. తాజాగా నెట్​ఫ్లిక్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. మలయాళంతో పాటు మరో నాలుగు భాషల్లో ఇది అందుబాటులో రానుంది.

నిజ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌నల్ని ఆధారంగా చేసుకుని రైటర్ బెన్యామిన్ రాసిన 'గోట్ డేస్‌' అనే నవల ఆధారంగా డైరెక్టర్ బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి నెలాఖరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. రూ.82 కోట్లతో నిర్మితమైన దాదాపు రూ.160 కోట్లు కలెక్షన్లు సాధించిందని సినీ విశ్లేషకుల అంచనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.