ETV Bharat / entertainment

స్వాతంత్ర్య సమరయోధుల కథలతో తెలుగు చిత్రాలు- ఒక్కసారైనా చూసి తీరాల్సిందే! - Patriotic Movies In Indian History

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 9:31 PM IST

Patriotic Movies In Indian History : దేశ స్వాత్రంత్య పోరాటంలో ఎందరో మహానుబావులు అమరులయ్యారు. బ్రిటిషర్లతో పోరాడి ఉరికంభాన్ని ఎక్కారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య సమరయోధుల ఇతివృత్తంతో తెరకెక్కిన తెలుగు సినిమాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Patriotic Movies
Patriotic Movies (Getty Images)

Patriotic Movies In Indian History : దాదాపు 200 సంవత్సరాల పరాయి పాలనకు చరమగీతం పాడేదాకా సాగిన భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కళలు, కళాకారుల పాత్ర కీలకం. ఈ ఉద్యమం పతాకస్థాయికి చేరుకున్న దశలోనే భారతీయ సినిమా మాటలు నేర్చింది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య ఉద్యమం, సమరయోధుల స్ఫూర్తితో తెలుగులో తెరకెక్కిన తెలుగు సినిమాలపై లుక్కేద్దాం పదండి.

అగ్గిపిడుగు అల్లూరి
స్వాతంత్ర్యం కావాలని ఆంగ్ల దొరలపై నిప్పుల చెరిగిన తెలుగు వీరుడు 'అల్లూరి సీతారామరాజు'. ఈ సినిమాలో సూపర్ కృష్ణ సీతారామరాజు పాత్రను పోషించారు. ఈ మూవీ అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఇందులో కృష్ణ అల్లూరి పాత్రలో పరాకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. 'ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు', మిస్టర్ రూథర్ ఫర్డ్ లాంటి కృష్ణ చెప్పిన డైలాగ్స్‌ ప్రేక్షకులను కట్టిపడేశాయి. వారికి గూస్ బంప్స్ తెప్పించాయి.

రేనాటి వీరుడు సైరా నరసింహారెడ్డి
స్వాతంత్య్రం కోసం జరిగిన తొలి యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆ తిరుగుబాటునే కథాంశంగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు. భారతీయుల గుండెలను ఉప్పొంగేలా చేసిన ఆ ఉద్యమగాథను సజీవంగా తెలుగు ప్రేక్షకులకు అందించారు మెగాస్టార్‌ చిరంజీవి. 'రేనాడు వీరులారా- చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి' అంటూ చిరంజీవి వెండితెరపై చేసిన గర్జనకు బాక్సాఫీస్‌ బద్దలైంది. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

ఇద్దరు పోరాట యోధుల 'ఆర్‌ఆర్‌ఆర్‌'
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఏకంగా ఇద్దరు పోరాట యోధులను 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం కోసం కీలక పాత్రలుగా ఎంచుకున్నారు. ఆంగ్లేయుల తూటాలకు ఎదురెళ్లిన అల్లూరితో, నిజాంపై పోరు జరిపిన గోండు వీరుడు కొమరం భీమ్‌ స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో భారీ బడ్జెట్​తో తెరకెక్కించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్​గా జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపోయారు. పవర్​ఫుల్ డైలాగ్​లతో ప్రేక్షకులను కట్టిపడేశారు. దీంతో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిసింది.

తూటాకి రొమ్మువిరిచిన ప్రకాశం పంతులు
బ్రిటీష్‌ దొరల తుపాకీ తూటాలకు రొమ్ము విరిచి ఇక్కడ కాల్చు అంటూ గుండెలను చూపించిన వీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన జీవితం ఆధారంగా తెలుగులో ఆంధ్రకేసరి సినిమా తెరకెక్కించారు. విజయ్‌ చందర్‌ టైటిల్‌ పాత్రను పోషిస్తూ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నంది అవార్డును గెలుచుకుంది.

గాంధీ సినిమాకు 8 అస్కార్ అవార్డులు
మహాత్మా గాంధీ జీవితకథ ఆధారంగా 1982లో రిచర్డ్‌ ఆటెన్‌బరో తెరకెక్కించిన 'గాంధీ' సినిమా ఏకంగా 8 ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుంది. హిందీలో జాతీయోద్యమ కథలతో 'ప్రేమ్‌కహానీ' (1975), 'క్రాంతి' (1981) వంటి చిత్రాలు వచ్చాయి. మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత నటుడు ఆమిర్‌ఖాన్‌ 'లగాన్‌', 'మంగళ్‌పాండే', 'రంగ్‌ దే బసంతి' వంటి చిత్రాలతో ఆ ఊపు తీసుకొచ్చారు. అలాగే విప్లవయోధుడు భగత్‌సింగ్‌ జీవిత చరిత్రపై పూర్తి నిడివితో హిందీలో ఏకంగా ఏడు సినిమాలు తెరకెక్కాయి. బ్రిటీషర్లు ఉరి తీసిన ఉద్ధం సింగ్‌ జీవితకథ ఆధారంగా ప్రముఖ నటుడు రాజ్‌ బబ్బర్‌ కీలక పాత్రలో 'షహీద్‌ ఉద్ధంసింగ్‌' (2000) చిత్రం తెరకెక్కింది.

అలాగే సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వంటివారు సినిమాల్లోకి రాకముందు క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలలు జైలుపాలయ్యారు. కోల్​కతాలోని అలీపుర్‌ జైలుకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఘంటసాలను తరలించింది. అలాగే నటుడు చిత్తూరు నాగయ్య జర్నలిస్టుగా పనిచేసినప్పుడు గాంధీ, నెహ్రూల స్ఫూర్తితో దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. భారతమాతకు జై అని నినాదం చేశారు.

Upcoming Patriotic Movies : క్విట్​ ఇండియా యువతి గాథ.. ఓ సైనికుడి సీక్రెట్‌ ఆపరేషన్‌.. తెరపైకి రానున్న దేశ భక్తి సినిమాలు ఇవే..

ఈ పంద్రాగస్టుకు.. ఈ వెబ్​సిరీస్​లు చూసేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.