ETV Bharat / snippets

పదకొండో సారి తండ్రైన ఎలాన్​ మస్క్​- 'న్యూరాలింక్​'​ ఎంప్లాయ్​తో మూడో సంతానం!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 3:12 PM IST

Elon Musk  11th Child
Elon Musk 11th Child (Associated Press)

Elon Musk 11th Child : టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ పదకొండోసారి తండ్రి అయ్యారు. తన న్యూరాలింక్‌ సంస్థ స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ హెడ్‌ అయిన షివాన్‌ జెలీస్‌కు మూడో సంతానం జన్మించిందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఈ జంటకు 2021లో కవలలు పుట్టారు. మస్క్‌కు ఇప్పటి వరకు మొత్తం 11 మంది సంతానం ఉన్నారు. వీరిలో ఐదుగురు తొలి భార్య జస్టిన్‌ మస్క్‌కు జన్మించగా, మరో ముగ్గురు మ్యూజిషియన్‌ గ్రిమెస్‌కు, ఇంకో ముగ్గురు జెలీస్‌కు పుట్టారు. మస్క్‌, తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం ఇదే మొదటి సారి కాదు. తనతో పిల్లలను కనాలని మస్క్‌ కోరినట్లు 2013లో స్పేస్‌ ఎక్స్‌ నుంచి ఉద్యోగం మానేసిన ఓ మహిళ పేర్కొనగా, మరో ఇద్దరు ఉద్యోగినులతో ఆయనకు సంబంధాలున్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.