Air India First A320Neo : ఎయిర్ ఇండియా చేతిలోకి ప్రీమియం ఎకానమీ సీట్లు అమర్చిన నారోబాడీ విమానం ఏ320 నియో వచ్చి చేరింది. ఈ విమానంలో 8 విలాసవంత బిజినెస్ తరగతి సీట్లు, 24 ప్రీమియం ఎకానమీ సీట్లు, సౌకర్యవంతమైన 132 ఎకానమీ సీట్లు ఉంటాయి. ప్రస్తుత విమానాల డిజైన్‌కు చాలా భిన్నంగా, సరికొత్త లివరీతో ఈ ఫ్లైట్‌ను తీర్చిదిద్దారు. ఫ్రాన్స్‌లోని ఎయిర్‌బస్ తయారీ ప్లాంటు నుంచి దిల్లీ విమానాశ్రయానికి ఆదివారమే ఈ విమానం వచ్చింది.
ప్రభుత్వ ఆధీనంలోని ఎయిరిండియా, టాటా గ్రూప్ ఆధీనంలోకి వచ్చాక, విమానాల ఆధునికీకకరణ ప్రారంభమైంది. కొత్త విమానాల కొనుగోలు సహా, ఇప్పటికే ఉన్న విమానాల్లోని సీట్లను, ఇతర సదుపాయాలను ఎయిర్ఇండియా మెరుగుపరుస్తోంది. వచ్చే నెల నుంచి దేశీయ మార్గాల్లో ఈ విమానాన్ని నడపనున్నారు. ఇప్పటికే ఎయిరిండియా దగ్గర 3 ఎయిర్‌బస్ 320 నియో ఫ్లైట్స్ ఉన్నా, అవన్నీ పాత డిజైన్ ప్రకారం రూపొందించినవి.