ETV Bharat / snippets

'ముందు సీఎం అభ్యర్థి ఎవరో తేల్చండి- కాంగ్రెస్, NCP ఎవరిని నిలబెట్టినా నాకు ఓకే!'

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 1:03 PM IST

Updated : Aug 16, 2024, 2:52 PM IST

Shiv Sena (UBT) chief Uddhav Thackeray
Shiv Sena (UBT) chief Uddhav Thackeray (ANI)

Uddhav Thackeray On MVA CM Candidate : మహారాష్ట్ర ఎన్నికల వేళ శివసేన యూబీటీ నేత ఉద్ధవ్‌ ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంవీఏ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందే నిర్ణయించాలని అన్నారు. సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్, ఎన్​సీపీ ఎవరిని ప్రకటించినా తాను మద్దతిస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారనే దానికన్నా ముందు అభ్యర్థిని ప్రకటించడం ముఖ్యమని వ్యాఖ్యానించారు. కూటమి తరఫున కార్యకర్తలంతా ఎన్నికల్లో ఉద్యమకారుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్ర ఆత్మ గౌరవం, ప్రయోజనాలను కాపాడేందుకేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర హక్కుల కోసం తాను పోరాడుతున్నానని, తన కోసం కాదని పేర్కొన్నారు. ఎంవీఏ కార్యకర్తలను ఉద్దేశించి శుక్రవారం ప్రసంగించిన ఆయన, పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Last Updated : Aug 16, 2024, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.